ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ఒక్కరోజే 2,628 కేసులు.. ఏడుగురు మృతి - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు

కర్నూలు జిల్లావ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం రికార్డుస్థాయిలో 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కాగా కర్నూలులో అత్యధికంగా 451, నంద్యాల 85, ఆదోని 49, ఎమ్మిగనూరులో 49 మంది వైరస్‌ బారిన పడ్డారు. శ్రీశైలంలో 272, కోవెలకుంట్ల 104, దేవనకొండ మండలంలో 85 కేసులు వచ్చాయి.

corona cases

By

Published : May 4, 2021, 8:54 AM IST

కర్నూలు జిల్లావ్యాప్తంగా సోమవారం 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 83,066 మంది వైరస్‌ బారిన పడ్డారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, క్వారంటైన్‌ సెంటర్లలో 11,400 మంది చికిత్స పొందుతున్నారు. 71,102 మంది ఆరోగ్యంగా ఇళ్లకు చేరుకున్నారు. సోమవారం అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు కొవిడ్‌ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 564కు చేరింది.

జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు

కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 5 వరకు వ్యాపార దుకాణాలు, సంస్థలను మూసివేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమతమ పరిధిలోని ల్యాబ్‌లు, మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వ్యాపార కేంద్రాలను సోమవారం మధ్యాహ్నం నుంచి మూయించారు. వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా మూసివేసి అధికారులకు సహకరించారు. గుంపులు గుంపులుగా తిరిగే వారిని మందలించారు. మాస్కులు ధరించనివారికి జరిమానా విధించారు.

భలే బేరం.. మాకొద్దు భౌతిక దూరం!

కరోనా ఉద్ధృతిని నిరోధించేందుకు ప్రభుత్వం మినీ లాక్‌డౌన్‌ ప్రవేశపెట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం నిరోధం నీటి మీద రాతే అనిపిస్తోంది. నందికొట్కూరులో సోమవారం పశువులు, కూరగాయల సంత ఉండటంతో వందలాది మంది వినియోగదారులతో సంత కిక్కిరిసింది. భౌతికదూరం ఊసే లేకుండా పోయింది. సంత నిర్వహణ విషయమై మార్కెట్‌ యార్డు అధికారులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నిర్వహించాలన్న ఆదేశాలు రావడంతో యథావిధిగా సాగింది. నెలకు సంత ద్వారా వచ్చే రూ.లక్ష ఆదాయంపై తప్ప ప్రజల ప్రాణాలపై అధికారులకు ఆపేక్ష లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details