ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా

By

Published : Mar 4, 2021, 8:12 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా నిర్వహించారు. లాభసాటి వ్యవసాయంతో అన్నదాతకు మేలు జరుగుతుందని కిసాన్ మేళాలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ శతాబ్ది భవన్​లో జరిగిన కార్యక్రమానికి సబ్ కలెక్టరు కల్పనా కుమారి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టరు రాంబాబు, పాలక మండలి సభ్యులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సమావేశ భవనంలో నిర్వహించిన సదస్సులో పలు అంశాలపై చర్చించారు. లాభసాటి వ్యవసాయంతో అన్నదాతకు మేలు జరుగుతుందని వక్తలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details