తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. సాయిబాబానగర్‌కు చెందిన హరనాథ్ అనే వ్యక్తి... చాగలమర్రి కిరణ్ అనే వ్యక్తి వద్ద రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తం తిరిగి ఇవ్వలేదని హరినాథ్‌ను కారులో తీసుకెళ్లి రాడ్లతో చితకబాదారు. అనంతరం ప్రాంసరీ నోట్లపై సంతకాలు తీసుకొని వదిలేసినట్లు బాధితుడు తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
దారుణం.. అప్పు తీర్చలేదని వ్యక్తిపై దాడి - kidnap
కర్నూలు జిల్లా నంద్యాలలో అప్పు కట్టలేదని కారణంతో హరినాథ్ అనే వ్యక్తిని కిరణ్ కిడ్నాప్ చేసి రాడ్లతో చితకబాదాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పు తీర్చలేదని వ్యక్తిపై దాడి..