కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాయి. కార్తిక పౌర్ణమి, సోమవారం నాడు.. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు.. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీశైలం ఆలయ పురవీధుల్లో భక్తుల కార్తిక దీపారాధనలు చేస్తున్నారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు కార్తిక దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం దేవాలయంలో దేదీప్యమానంగా కార్తిక దీపాలు - శ్రీశైలం దేవాలయంలో కార్తీక మాసం సందడి
కార్తిక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలి వచ్చి కార్తిక దీపాలను వెలిగిస్తున్నారు.
karthika pounami pooja