శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళే కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా... ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివునికి ప్రీతికరమైన మాసమైన కారణంగా.. భక్తుల తాకిడి మొదలైంది. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాయంత్రం అర్చకులు, వేదపండితులు ఆకాశ దీపాన్ని వెలిగించనున్నారు.
ఈ మాసంలో 20 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు పంపిణీ చేయనున్నారు. రెండు విడతలుగా రుద్రహోమం, చండీహోమాలు జరుగుతాయి. రద్దీ రోజులు, వారాంతాల్లో ఆలయ వేళల్లో మార్పులు చేశారు. బందోబస్తును పటిష్టం చేశారు.