కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చాలా పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లు లేక వెలవెలపోతున్నాయి. మొత్తం 36 జడ్పీటీసీ, 483 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా... 1785 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
- ఆదోని మండలంలో పరిషత్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి.
- నంద్యాల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.