పారిశుద్ధ్య సమస్యలు రాకుండా నిరంతరం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు చెప్పారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో నగరమంతా పిచికారి చేయిస్తున్నామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్టు చెప్పారు. విదేశాల నుంచి నగరానికి ఇటీవల 278 మంది వచ్చినట్టు గుర్తించామన్నారు. వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. నిత్యావసర వస్తువులను ఇళ్లకు పంపిణీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలను ఈటీవీ భారత్తో ముఖాముఖిలో పంచుకున్నారు.
'పరిశుభ్రతతోనే కరోనాను నియంత్రించవచ్చు'
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంపై నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. నగరంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు.
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు