కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో వారి మతాచారాలను పాటిస్తూ... కార్యక్రమం పూర్తి చేశారు. ప్రజలెవరూ కరోనా మృతదేహాలను చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.
కరోనా మృతునికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు - news on karnool mla
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మానవత్వం చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి వారి మతాచారాలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మృతిచెందిన వారికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలని సూచించారు.
కరోనా మృతదేహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు
Last Updated : Aug 1, 2020, 4:44 PM IST