కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో రైతులు పండించిన ధాన్యం తరలించలేక ఇబ్బంది పడుతున్నారు. గాజులదిన్నె జలాశయం కింద రబీలో 900 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి, మిరప సాగు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వేల బస్తాల ధాన్యం, ఉల్లి దిగుబడులు కొనేందుకు వ్యాపారులు రాక రైతులు కల్లాల్లో ధాన్యం ఉంచి దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కల్లాల్లో పంట .. కళ్లల్లో దైన్యం
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రైతులు కల్లాల్లో పంటను అమ్ముకోలేక కష్టాలు పడుతున్నారు. లాక్డౌన్తో కొనేవారు లేక దిగాలుపడుతున్నారు.
పంట మార్కెట్ చేయలేక కర్నూలు రైతుల కష్టాలు