ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ-నామ్‌ పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయండి - కర్నూలులో ఉల్లి వార్తలు

కర్నూలు జిల్లా రైతుల నుంచి క్వింటాలు 770 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.

karnool collector meeting on onions
కర్నూలులో ఉల్లి

By

Published : Aug 7, 2020, 11:58 PM IST

కర్నూలు జిల్లా రైతుల నుంచి క్వింటాలు 770 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయనా ఆడిటోరియలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని గూడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, కోసిగి, డోన్ మార్కెట్లలో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఓపెన్ ఆక్షన్‌లో కాకుండా ఈ-నామ్‌ పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details