'నీళ్లింకని నేల' పేరుతో సీమవెతలపై రాసిన పుస్తకం..రాయలసీమ ప్రజల దుర్భలపరిస్థితిలను బాహ్యప్రపంచానికి తెలిపేలా ఉందని సాహితీ ప్రియులు పేర్కొన్నారు. సీమ కరువుపై కవులు, రచయితలు రాసిన కథల సంకలనంగా రూపొందిన ఈ పుస్తకాన్ని కర్నూలు ఎమ్మిగనూరులో సాహితి స్రవంతి సంఘం విడుదల చేసింది. ఏళ్లుగా ఉన్న కరువు పరిస్థితులతో తరతరాలుగా ప్రజలు పడుతోన్న కష్టాలు, ప్రభుత్వాల వైఫల్యాలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాలను చూపించిందో ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సీమలో యథార్థ గాథలను విని రాసిన పుస్తకమని, సాహితి స్రవంతి కన్వీనర్ నాగమణి అన్నారు.
సీమ వెతలను కళ్లకు కట్టే 'నీళ్లింకని నేల' పుస్తకం - 'న్నీళ్లింకని నేల' పుస్తక పరిచయం
'న్నీళ్లింకని నేల' పుస్తక పరిచయ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించారు. రాయలసీమ కరువు పరిస్థితలపై ఈ పుస్తంకం రాశామని సాహితి స్రవంతి సంఘం వెల్లడించింది.
'న్నీళ్లింకని నేల' పుస్తక పరిచయం