శ్రీశైలంలోని దేవస్థానంలోని కళ్యాణ కట్ట.. భక్తుల సౌకర్యార్ధం తెరచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ క్షురకులు విడత వారిగా విధుల్లో పాల్గొంటున్నారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు తలనీలాలు తీస్తున్నారు.
శ్రీశైలంలో తలనీల సమర్పణ సేవలు ప్రారంభం.. - శ్రీశైలం తాజా వార్తలు
శ్రీశైలంలోని దేవస్థానం కళ్యాణ కట్ట తెరుచుకుంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నిబంధనతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
శ్రీశైలం దేవస్థాన కళ్యాణ కట్ట