కర్నూలులోని తుంగభద్ర పుష్కర ఘాట్లను తెదేపా నేతలు కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించడం లేదని వారు ఆరోపించారు. పాత ఘాట్లకు రంగులు వేయడం మినహా ప్రభుత్వం ఏమీ చేయలేదని కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
'తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం అపవిత్రం చేస్తోంది' - కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాలను వైకాపా ప్రభుత్వం అపవిత్రం చేస్తోందని... తెదేపా ఆరోపించింది. పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులోని పుష్కర ఘాట్లను పరిశీలించారు.
పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న తెదేపా నేతలు
స్నానం చేస్తున్నవారిని లాక్కెళ్లి... అరెస్టు చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే చెందుతుందని ఎద్దేవా చేశారు. తుంగభద్ర నదిలో మురుగు నీరు కలుస్తున్నా పట్టించుకోవటం లేదని... ఇప్పటికైనా నదిని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: