ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KaleshwaramProject : కాళేశ్వరంలో ఎత్తిపోతలు మళ్లీ షురూ - ఏపీ న్యూస్​

Kaleshwaram Project Pump Houses Reopens : గతేడాది గోదావరికి భారీ వరదలు రావడంతో కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన పంపుహౌస్​లు నీట మునిగాయి. వీటన్నింటినీ ఒకదాని తరవాత ఒకటి మరమ్మత్తు చేసి తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌస్​లను తిరిగి పునరుద్ధరించి ఎత్తిపోతలు పునఃప్రారంభించారు.

Kaleshwaram Project Pump Houses
కాళేశ్వరంలో ఎత్తిపోతలు

By

Published : Jan 6, 2023, 10:32 AM IST

Kaleshwaram Project Pump Houses Reopens: తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పథకంలోని మూడు పంపుహౌస్‌ల నుంచి గురువారం రాత్రి ఎగువకు ఎత్తిపోతలను తిరిగి ప్రారంభించారు. గతేడాది జులైలో గోదావరికి భారీ వరదలు రావడంతో లక్ష్మి, సరస్వతి పంపుహౌస్‌లలోని 12 పంపులు నీట మునిగాయి. వాటికి మరమ్మతులు చేసిన అనంతరం కొద్దిరోజుల కిందట ట్రయల్​ రన్‌ నిర్వహించారు.

సజావుగా నడవడంతో గురువారం రాత్రి లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌ల నుంచి రెండు మోటార్ల చొప్పున నడిపిస్తూ శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయానికి ఎత్తిపోతలు ప్రారంభించారు. లక్ష్మి పంప్‌హౌస్‌లో 1, 2 మోటార్లను నడిపించారు. పంపుహౌస్‌ల నుంచి మొదట ఎల్లంపల్లి జలాశయానికి, అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించనున్నట్లు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుత్తును ఆదా చేయడానికి లక్ష్మి పంపుహౌస్‌లో 2 మోటార్లను రాత్రి సమయంలోనే నడిపించనున్నట్లు తెలిసింది. రాత్రి 10 నుంచి వేకువజామున 4 గంటల వరకు ఎత్తిపోతలను కొనసాగించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details