ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MP Avinash Reddy in Kurnool: కర్నూలులో కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆస్పత్రిలోనే ఎంపీ అవినాష్​ - ap latest news

Tension at Vishwa Bharathi Hospital : కర్నూలులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్​ తల్లికి చికిత్స కొనసాగుతోంది. తల్లి వెంటే అవినాష్​ ఉన్నారు.

MP Avinash Reddy in Kurnool
MP Avinash Reddy in Kurnool

By

Published : May 23, 2023, 12:30 PM IST

Updated : May 23, 2023, 3:37 PM IST

Tension at Kurnool: కర్నూలులో విశ్వభారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లితో పాటు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఆయన అనుచరులు రాత్రంతా ఆసుపత్రి వద్ద జాగారం చేశారు. వారికి స్థానిక వైఎస్సార్​ కాంగ్రెస్​ నేతలు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అవినాష్‌ కోసం వచ్చిన సీబీఐ అధికారుల్లో ఓ బృందం .. రాత్రి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయింది. మరో బృందం కర్నూలు పోలీసు రెస్ట్ హౌస్​లో ఉంది. సీబీఐ బృందం హైదరాబాద్ వెళ్లిపోవడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు మోహరింపు ఇంకా అలాగే ఉంది. మరోవైపు ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఈ నెల 19న తల్లి శ్రీలక్ష్మిని అవినాష్‌ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించిన విషయం విధితమే.

సీబీఐ నిర్ణయంపై ఉత్కంఠ: అయితే నిన్న కర్నూలులో పలు నాటకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. సీబీఐ విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాష్​ రెడ్డి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే దానిని సీరియ్​గా భావించిన కేంద్ర దర్యాప్తు సంస్థ రెండు బృందాలుగా తెల్లవారుజామునే కర్నూలుకు వెళ్లారు. అయితే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు రావడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కాగా సీబీఐ అధికారులు వెళ్లడంతో వైసీపీ శ్రేణులు, అవినాష్​ అనుచరులు భారీగా చేరుకున్నారు.

ఏ క్షణమైనా అవినాష్​ అరెస్టు ఖాయమని ప్రచారం జరిగిన నేపథ్యంలో అవినాష్​ అనుచరులు అలజడి సృష్టించారు. మరోవైపు మీడియా ప్రతినిధులపై దాడులు కూడా చేశారు. అవినాష్​ను లొంగిపోవాలని సీబీఐ అధికారులు ఎస్పీకి తెలిపిన.. శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని చేతులేత్తేసారు. సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చిన సీబీఐ బృందాల్లో రాత్రి ఓ బృందం హైదరాబాద్​ వెళ్లగా.. మరో బృందం కర్నూలులోనే ఉంది. అయితే ఈరోజు సీబీఐ అధికారులు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేరకు సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం..

సుప్రీంకోర్టులో అవినాష్​ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ: మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్ నరసింహ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఈ నెల 25న విచారణ జరపాలని హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అవినాష్‌ మధ్యంతర రక్షణకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అన్ని పక్షాలు హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ముందు వాదనలు వినిపించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:

Last Updated : May 23, 2023, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details