చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి కోసం.. ఆమె కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. జ్యోతి త్వరగా ఇంటికి తిరిగి రావాలని కోరుతూ.. ఆమె తల్లి ప్రమీలాదేవి.. మహానందిలో యాగం చేయించారు. కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో.. జ్యోతిని చైనాలో అధికారులు ఆమె సహోద్యోగులతో పాటుగా పరీక్షిస్తున్నారు. భారత్ పంపేందుకు అంగీకరించడం లేదు. తనకు.. కరోనా లక్షణాలు లేవని, సాధారణ అస్వస్థతే ఉందని జ్యోతి వీడియో తీసి తన కుటుంబానికి పంపింది. ఈ విషయమై.. రెండు రోజుల క్రితమే విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కు.. రాజ్యసభలో భాజపా ఎంపీ టీజీ వెంకటేష్, నంద్యాల లోక్ సభ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి వివరించారు. అయినా ఆశించిన ఫలితం రాని కారణంగా.. జ్యోతి తల్లి ప్రమీలా ఆవేదన చెందుతున్నారు. అందుకే.. పూజలు చేయించినట్టు చెప్పారు.
వుహాన్‌లో చిక్కుకున్న కూతురు త్వరగా తిరిగి రావాలని యాగం - ap jyothi in china news updates
చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకున్న తన కూతురు జ్యోతి.. త్వరగా తిరిగి రావాలని ఆమె తల్లి యాగం చేయించారు.
jyothy-mother-hommam-in-karnool