జూరాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లుకాగా... ప్రస్తుతం 316.33 మీటర్లకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 7.74 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 7.75 లక్షల క్యూసెక్కులు ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 5.67 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు... ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి... వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలంకు పంపుతున్నారు.
జూరాలకు పెరుగుతున్న ప్రవాహం - జూరాల
జూరాలకు భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 8.30 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 8.27 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 316.33 మీటర్లకు చేరింది. వరద ప్రవాహం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
జూరాలకు భారీగా చేరిన వరద నీరు