ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్యులపై దాడికి పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలి' - Junior doctors protest against the attack on a junior doctor

వైద్యులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన

By

Published : May 26, 2021, 1:42 PM IST

వైద్యులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. విశాఖ కేజీహెచ్​లో జూనియర్ డాక్టర్​పై దాడిని ఖండించారు.

కొవిడ్ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వాళ్లను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడు డా. ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details