కర్నూలు జిల్లా ఆదోనిలోని వార్డు సచివాలయాలను జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని 25వ వార్డు సచివాలయం తనిఖీ చేసి దస్త్రాలు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డు సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీ
ఆదోనిలోని వార్డు సచివాలయాలను జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా ఆకస్మిక తనిఖీ చేశారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికి అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లలను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా...సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ....ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు అదనపు సొమ్ము