సున్నిపెంట గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అన్నింటిని అందజేయాలని ఎమ్మెల్యే, జేసీ నిర్ణయించారు. గ్రామ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో పారిశుద్ధ్య సేవలు, విద్యుత్ , తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలను జేసీ అడిగి తెలుసుకున్నారు.
సున్నిపెంట అభివృద్ధిపై జేసీ సమీక్ష - jc review meeting on sunnipenta development
శ్రీశైలం మండలంలోని సున్నిపెంటను ఆదర్శ గ్రామంగా మార్చేందుకు చేపట్టిన చర్యలపై జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
![సున్నిపెంట అభివృద్ధిపై జేసీ సమీక్ష jc review meeting on sunnipenta development](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7588037-1085-7588037-1591969602440.jpg)
సున్నిపెంట అభివృద్ధిపై జేసీ సమీక్ష సమావేశం
జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో సమస్యలను పరిష్కరించుకుంటూ గ్రామ ప్రజలకు సేవలందిస్తామని ఎమ్మెల్యే, జేసీ స్పష్టం చేశారు. సున్నిపెంట గ్రామానికి ఎంపీడీవో కార్యాలయాన్ని మంజూరు చేయడానికి ప్రతిపాదనలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చదవండి: ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం