ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్యంతో జవాన్ మృతి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు - ఈరోజు కర్నూలుకు చెందిన జవాన్ మృతి తాజా వార్తలు

ఈ నెల 30న ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన జవాన్ నాయక్ దళాలు షఫీ.. మృతి చెందారు. అతని పార్థివదేహాన్ని దిల్లీ నుంచి స్వస్థలం బనగానపల్లెకు తరలించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఇతర అధికారులు నివాళులర్పించారు.

Funeral with government formalities
జవాన్​కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

By

Published : Apr 1, 2021, 4:09 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లెలో జవాన్ నాయక్ దళాలు షఫీ (30)కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. షఫీ ఈనెల 30న ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. పార్థివదేహాన్ని దిల్లీ నుంచి స్వస్థలం బనగానపల్లెకు తరలించారు. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఇతర అధికారులు పార్థివదేహానికి నివాళులర్పించారు.

పాత బస్టాండ్ సమీపంలోని జుమ్మా మసీదుకు మృతదేహాన్ని తీసుకెళ్లి ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి సర్కిల్ కార్యాలయం మీదుగా.. పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. స్థానిక ప్రముఖులు కాటసాని ఓబుల్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి.. కార్యక్రమానికి భద్రత కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details