వైకాపా నాయకులు పోలీసులపై దాడులు ఆపాలని కర్నూలులో జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐ స్థాయి అధికారులపై వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదన్నారు. పోలీసులపైనే కాకుండా సచివాలయ ఉద్యోగులపై కుడా ఇటీవల అధికార పార్టీ నాయకులు దాడులు చేశారని ఆరోపించారు. ఇకపై ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడితే జనసేన చూస్తూ ఊరుకోదంటూ వైకాపాను హెచ్చరించారు.
'అధికారులపై దాడులను ఇకపై ఉపేక్షించాం' - janasena protest at kurnool district news update
అధికారులపై వైకాపా నేతలు దాడులు ఆపాలంటూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన ధర్నా చేపట్టింది. ఇకపై ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే జనసేన చూస్తూ ఊరుకోదంటూ వైకాపాను హెచ్చరించారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన ధర్నా