ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రూ.10వేలు తక్షణ సాయం చేసి రైతులను ఆదుకోవాలి' - Janasena demands financial assistance to farmers

కర్నూలులో జనసేన నాయకులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులకు తక్షణం రూ.10వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. నివేదికల అనంతరం మరో రూ.35 వేలు ఇవ్వాలని కోరారు.

Janasena leaders protest
రైతులను ఆదుకోవాలి

By

Published : Dec 7, 2020, 6:55 PM IST

పంట నష్టం జరిగిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కర్నూలులో జనసేన నేతలు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అన్నదాతలకు మద్దతుగా దీక్షలు చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నివేదికలు వచ్చిన తరువాత మరో రూ.35వేలు సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details