కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లే లక్ష్యంతో కర్నూలు జిల్లా మునగాలపాడులో భాజపా నేతలు జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. దేశంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్నా ... అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ ఇస్కా తెలిపారు. ఈ నెల 17వ తేదీన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో పర్చువల్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు.
మునగాలపాడులో జన సంపర్క్ అభియాన్ - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా మునగాలపాడులో జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ తెలపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని భాజపా నేతలు తెలిపారు.
![మునగాలపాడులో జన సంపర్క్ అభియాన్ Jana Sampark Abhiyan Program in Munagalapadu kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7628615-208-7628615-1592227554965.jpg)
పర్చువల్ ర్యాలీ వివరాలు వెల్లడిస్తున్న భాజపా నేతలు