ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన వైకాపా ఎమ్మెల్యేలు - కర్నూలులో జగన్ పర్యటన

కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రేపు పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను వైకాపా ఎమ్మెల్యేలు శిల్పచక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు.

jagna tour
జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన వైకాపా ఎమ్మెల్యేలు

By

Published : Feb 17, 2020, 6:39 PM IST

కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రేపు పర్యటించనున్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మూడో విడత వైఎస్​ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఆరోగ్య వికాస కేంద్రాల నమూనా భవనాలు పరిశీలించి శిలఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైకాపా ఎమ్మెల్యేలు శిల్పాచక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పరిశీలించారు. సభుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన వైకాపా ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details