ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

contract employees regularization : ఐదేళ్ల నిబంధనతో సర్కారు మెలిక.. కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు ఆవిరి - Government Junior College Lecturers

contract employees regularization : కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఐదేళ్ల నిబంధన పేరుతో సగం మందికే అవకాశం కల్పించారు. 2014 జూన్ 2 నాటికే ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలన్న షరతు కారణంగా కొంత మందికే అవకాశం దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కలిసి మెలిసి.. స్నేహితుల్లా పనిచేసిన ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టినట్లు అవుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధన సడలించి అందరికీ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 8, 2023, 10:14 AM IST

contract employees regularization : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలుపడాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు స్వాగతిస్తూనే... తమకు అన్యాయం జరిగిందని కర్నూలు లో ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ రెండు నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పడంతో వారు వ్యతిరేకించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3618 మంది జూనియర్ లెక్చరర్ లో 2014 జూన్ రెండు నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన వారు సగం మంది మాత్రమే ఉన్నారని మిగిలిన సగం మంది అధ్యాపకులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిభందనలు లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపినందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ, షరతులు విధించడం వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతోంది. 2014 జూన్ 2 నాటికే ఐదేండ్లు సర్వీసు పూర్తి చేయాలన్న నిబంధన వల్ల దాదాపు 3 వేల మందిలో 15 వందల మందికి కూడా న్యాయం జరగడం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. - బ్రహ్మేశ్వర్లు, కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి

2010లో నేను కాంట్రాక్టు అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాను. నా లాంటి వాళ్లు ఎంతో మంది ఉండగా.. ప్రభుత్వం విధించిన కటాఫ్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్రంలో ఎలాంటి కటాఫ్ విధించకుండా అందరినీ రెగ్యులర్ చేసినట్లు... ఇక్కడ కూడా అదే విధానం పాటిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని నమ్ముకుని సంవత్సరాల తరబడి కాంట్రాక్టు ఉద్యోగంలో కొనసాగుతున్న మాకు న్యాయం చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నాం.- నాగవేంద్ర, కాంట్రాక్టు అధ్యాపకుడు

మాతోటి కలిసి మెలిసి పని చేసిన కాంట్రాక్టు లెక్చరర్లకు కటాఫ్ పెట్టడం వల్ల మమ్మల్ని డివైడ్ చేసినట్లుగా ఉంది. ఐదు సంవత్సరాల నిబంధన కాకుండా, ఎలాంటి షరతులు విధించకుండా అందరినీ రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - చాంద్ బాషా, కాంట్రాక్టు అధ్యాపకుడు

ABOUT THE AUTHOR

...view details