కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఫిర్యాదుతో ఎలాంటి విచారణ లేకుండా భాజపా నాయకురాలు బై రెడ్డి శబరిపై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయంగా నమోదు చేశారని భాజపా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు డా.బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు వైకాపా నాయకులను అనుగుణంగా పని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీకిి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట భాజపా మహిళ నాయకురాలు లక్ష్మి పాల్గొన్నారు.
'భాజపా నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం' - kurnool district newsupdates
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకుల తీరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఉందని.. కర్నూలు జిల్లా నంద్యాల భాజపా పార్లమెంటు అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
భాజపా నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం: బుడ్డా శ్రీకాంత్ రెడ్డి