ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులికనుమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పాలనా అనుమతులు జారీ - పులికనుమ ప్రాజెక్ట్ అప్​డేట్స్

కర్నూలు జిల్లాలోని కోసిగి వద్దనున్న పులికనుమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వ్యయం సవరించిన అంచనాలకు ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. మొత్తం రూ.310.46 కోట్లతో అనుమతులు జారీ అయ్యాయి.

Issued administrative clearances for construction of Pulikanuma Upliftment Scheme
పులికనుమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పాలనా అనుమతులు జారీ

By

Published : Dec 2, 2020, 5:00 PM IST

కర్నూలు జిల్లాలోని కోసిగి వద్ద నిర్మించనున్న పులికనుమ ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం సవరించిన అంచనాలకు పాలనా అనుమతులు జారీ అయ్యాయి. అంచనాలు, డిజైన్లు, సర్వే, నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలతో కూడిన టర్న్ ప్రాతిపదికన ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పులికనుమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రెండు దశల్లో రిజర్వాయర్, పంపింగ్ నిర్మాణానికి రూ.310.46 కోట్లతో అనుమతులు జారీ అయ్యాయి.

మొత్తం 1.23 టీఎంసీల నీటి నిల్వ కోసం పులికనుమ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2008లో రూ.261 కోట్ల అంచనా వ్యయంతో పులికనుమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తదుపరి 2018లో అంచనా వ్యయాన్ని రూ.293 కోట్లకు సవరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా రూ.310 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి: ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details