ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం చేరుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - irrigation minister anilkumar yadav visit srishailam project kurnool district

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీశైలం చేరుకున్నారు. ఆయనకు శ్రీశైలం ఆనకట్ట ముఖ్య ఇంజినీర్ మురళీధర్ రెడ్డి, పర్యవేక్షక ఇంజినీర్ చంద్రశేఖర రావు, దేవస్థానం ఈవో రామారావు స్వాగతం పలికారు.

మంత్రికి స్వాగతం పలుకుతున్న అధికారులు
మంత్రికి స్వాగతం పలుకుతున్న అధికారులు

By

Published : May 31, 2020, 9:48 PM IST



రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహం వద్దకు చేరుకున్న మంత్రికి శ్రీశైలం ఆనకట్ట ముఖ్య ఇంజినీరు మురళీధర్ రెడ్డి, పర్యవేక్షక ఇంజినీర్ చంద్రశేఖర రావు దేవస్థానం ఈవో రామారావు సాదర స్వాగతం పలికారు. మంత్రి అనిల్ కుమార్ శ్రీశైలం ఆనకట్టను సందర్శించి దాని స్థితిగతులు, నీటి మట్టం వివరాలు, సిబ్బంది కొరత వల్ల ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. సోమవారం ఉదయం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం డ్యాం సైట్ లో ఆనకట్ట ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:గాలివాన బీభత్సం..ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details