ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2021, 7:11 PM IST

ETV Bharat / state

డ్యాంల పరిరక్షణకు 315 మంది నియామకానికి కసరత్తు: మంత్రి అనిల్ కుమార్

రాష్ట్రంలోని జలాశయాల పరిరక్షణకు అవసరమైన నిపుణులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్​ ఆధ్వర్యంలో నిపుణుల నియామకానికి కసరత్తు జరుగుతున్నట్లు మంత్రి చెప్పారు. కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయాన్ని మంత్రి తనిఖీ చేశారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

రాష్ట్రంలోని అన్ని జలాశయాలపై ప్రత్యేక పర్యవేక్షణకు చర్యలు చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అందులో భాగంగానే సీఎం జగన్​ ఆధ్వర్యంలో అవసరమైన నిపుణుల నియామకానికి కసరత్తు జరుగుతున్నట్లు మంత్రి చెప్పారు. కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయాన్ని మంత్రి అనిల్ కుమార్ తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయానికి భారీగా వరద చేరిందన్నారు. అయితే సుంకేసుల ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేదన్నారు. సీఎం జగన్​.. ఆధ్వర్యంలో డ్యాంల పరిరక్షణ, అవసరమైన నిపుణుల కోసం 315 మంది నియామకానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేశామన్నారు. త్వరలోనే నియామకాలు భర్తీ చేస్తామన్నారు. సుంకేసుల జలాశయం మరమ్మతులకు నోచుకోట్లేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పులిచింతల ప్రాజెక్టును సైతం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.

అలాగే గాజులదిన్నె జలాశయం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు మంత్రి జలాశయంలోని గేటును పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి రాకపోకలపై జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళి నాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు కోడుమూరు, కర్నూల్ ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, హాఫిజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details