ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో ఐపీల్ క్రికెట్ బుకీలు అరెస్టు - IPL cricket bookies at adoni latest news

కర్నూలు జిల్లా ఆదోనిలో ఏడుగురు ఐపీల్ క్రికెట్ బుకీలను పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. వారి నుంచి పెద్ద ఎత్తున నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

IPL cricket bookies arrested
ఆదోనిలో ఐపీల్ క్రికెట్ బుకీలు అరెస్టు

By

Published : Oct 16, 2020, 7:45 PM IST


కర్నూలు జిల్లా ఆదోనిలో ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల దగ్గర 3 లక్షల 44 వేల నగదు, 18 సెల్ ఫోన్​లు స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ నిర్వహించిన దాడుల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిని అదుపులో తీసుకున్నారు. బ్యాంకు పాస్ పుస్తకాలు ఐపీఎల్ బుకింగ్ నోట్ పుస్తకాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details