ప్రశ్న: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు 6 లక్షల 23 వేల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 5 లక్షల 59 వేల హెక్టార్లు వివిధ పంటలు సాగు చేయడమైంది. పత్తి 2 లక్షల 54 వేల హెక్టార్లు, మొక్కజొన్న 36 వేల హెక్టార్లు, కంది 61 వేల హెక్టార్లు, వేరు శనగ 82 వేల హెక్టార్లు, మిరప, ఉల్లి 16 వేల హెక్టార్లు సాగు చేశారు. జూన్, జులై నెలల్లో కురిసిన వర్షాలకు కొంత వరకు పంట నష్టం జరిగింది. ప్రభుత్వానికి పంట నష్టంపై అంచనా వేసి రిపోర్టు పంపించాం. సెప్టెంబర్ నెలలో గత వారం నుంచి ఎక్కువ వర్షం పడటం వల్ల చెరువులు నిండి, వాగులు కోతకు గురవ్వటంతో పంట నష్టం ఎక్కుగా జరిగింది. ఇప్పటి వరకు ప్రాథమిక సర్వే ప్రకారం జిల్లాలో 25 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కమిషనర్‌కు రిపోర్టు చేశాం. మొక్కజొన్న 11 వేల హెక్టార్లు, వరి 8 వేల హెక్టార్లు, పత్తి సుమారు 5 వేల హెక్టార్లు వీటితో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
ప్రశ్న : ఏఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏఏ ప్రాంతాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగింది?
జవాబు : ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రాంతంలోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వాగు నీరు, చెరువులు తెగడం వల్ల పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. నంద్యాల ఆగ్రికల్చర్ సబ్ డివిజన్‌లో బండిఆత్మకూరు ప్రాంతంలో కుందూ నది వల్ల పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. పాణ్యం ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో, నంద్యాల మండలంలో కుందూ నదితో కొంత పంట నష్టం జరిగింది.
ప్రశ్న: జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది. ?
జవాబు : పశ్చిమ ప్రాంతంలో సెప్టెంబర్ వర్షాలకు హోళగుందలో తుంగభద్ర నది ప్రవాహంతో పంట నష్టం రిపోర్టు చేశాం. మిగతా మండలాల్లో పంట నష్టం జరగలేదు.
ప్రశ్న: ప్రాథమిక అంచనా ప్రకారం ఎంత నష్టం జరిగింది ?
జవాబు: సర్వే నెంబర్ల వారీగా అంచనా వేస్తున్నాము. వరి తప్ప మిగతా పంటలన్నీ జిల్లాలో 100 శాతం ఈ పంట నమోదు చేశాం. వరి 71 వేల హెక్టార్లకు గాను 69 వేల హెక్టార్లు వేసినట్టు వచ్చింది. అన్ని పంట కాల్వల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ సంవత్సరం జిల్లాలో వరి సాగు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం కోట్లలోనే నష్టం రావచ్చని అనుకుంటున్నాం. అంచనా పూర్తయిన తరువాత సరైన నష్టం తెలుస్తుంది.
ప్రశ్న : కొన్నిచోట్ల పంట చేతికందే సమయంలో వర్షాలతో నష్టపోయినట్లుంది ?