కళాశాల భవనం పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సురేంద్ర అనే విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకాడు.
దానిని గమనించిన కళాశాల నిర్వాహకులు విద్యార్థిని వెంటనే చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి రెండు కాళ్ళు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. నిడ్జూరు గ్రామానికి చెందిన సురేంద్ర రెండురోజుల క్రితమే కళాశాలకు వెళ్లాడు. చదువు పై ఆసక్తిలేక సురేంద్ర ఇలాచేసినట్టు తెలుస్తోంది.