కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించి.. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని పోలీసులు విన్నూతంగా ఫొటోలు తీస్తున్నారు. 'అన్నీ తెలిసిన మూర్ఖుడను' అనే వాక్యాలను బ్యానరులో రాసి ఫొటో చిత్రిస్తున్నారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు ఈ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష..!
ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి బయటకు రావద్దని చెబుతున్నా... కొందరు ఆ సూచనలను బేఖాతరు చేస్తున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా రోడ్లపైకి వస్తూ పోలీసులకు అసహనం కలిగిస్తున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు వినూత్నంగా బుద్ధి చెబుతున్నారు.
నంద్యాలలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారికి వినూత్న శిక్ష