కరోనా నియంత్రణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనా కట్టడికి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వినూత్నంగా యముడు, చిత్రగుప్తుడు, భటుడు తదితర వేషధారణలతో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఇంట్లో ఉంటే స్వర్గ లోకం, బయటకి వస్తే యమలోకం అంటూ యముడు పుర వీధులగుండా తిరుగుతూ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇంట్లో ఉంటే జనాభా లెక్కల్లో ఉంటావు.. బయటకు వస్తే కరోనా లెక్కల్లో ఉంటావని పేర్కొన్నారు. బయట తిరుగుతున్న వ్యక్తులకు యమపాశం వేసి బయట తిరిగితే యమలోకానికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అందరూ లాక్‌డౌన్‌ను పాటించాలని, అవసరముంటేనే గానీ బయటకు రావొద్దని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. బయటకు వచ్చినపుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ఇంట్లో ఉంటే స్వర్గలోకం... బయటకు వస్తే యమలోకం - different awareness on corona
కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా డోన్‌లో వినూత్నంగా యముడు, చిత్రగుప్తుడు, భటుడు తదితరుల వేషధారణలతో ప్రజలకు అవగాహన కల్పించారు.
![ఇంట్లో ఉంటే స్వర్గలోకం... బయటకు వస్తే యమలోకం Innovative campaign on Corona with Yamudu, Chitragupta and Bhadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6612039-637-6612039-1585666765426.jpg)
డోన్‌లో యముడు, చిత్రగుప్తుడు, భటుడు వేషధారణతో కరోనాపై వినూత్న ప్రచారం
ఇంట్లో ఉంటే స్వర్గలోకం... బయటకు వస్తే యమలోకం
ఇదీ చదవండి.