కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఓ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్లదే అధిపత్యం కొనసాగుతోందని బీసీ వర్గానికి చెందిన వైద్యులు ఆరోపిస్తున్నారు. బీసీ వైద్యులకు ప్రమోషన్ల విషయంలో సీనియారిటీ ఉన్నా... అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. ఆసుపత్రి పర్యవేక్షులుగా 20రోజుల క్రితం డా. జిక్కిని నియమించగా.. కొద్ది రోజులకే ఆమెను కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ చేశారని అన్నారు. అయితే ఆసుపత్రికి డా. నరేంద్రనాథ్ రెడ్డిని పర్యవేక్షకులుగా నియమించడం సరికాదన్నారు.
ఎంతో సీనియారిటి ఉన్న డాక్టర్ చంద్రశేఖర్‌ను కర్నూలు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ నుంచి సాధారణ వైద్యునిగా బదిలీ చేయటంపై వారు మండిపడుతున్నారు. డా. చంద్రశేఖర్‌కు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.