శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆనకట్ట 10 గేట్లు 24 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 5 లక్షల 47 వేల 630 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది. విద్యుదుత్పత్తి చేసి అదనంగా 67 వేల 281 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 210.99 టీఎంసీలు ఉండగా... నీటిమట్టం 884.20 అడుగులు ఉంది.
నిరంతర ప్రవాహం... నిండుకుండల్లా జలాశయాలు - కృష్ణానదిపై ఉన్న జలాశయాలు
కృష్ణానదిపై ఉన్న జలాశయాలకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రభావం ఉంటుందని అంచనా వేసిన గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
శ్రీశైలం
పులిచింతలకు వరద ఉద్ధృతి...
గుంటూరు జిల్లాలోని పులిచింతల జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. సాగర్ నుంచి పులిచింతలకు ఇన్‌ఫ్లో ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కులు ఉండగా... 6 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. జలాశయ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండీ... బెజవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు