కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ శిశువు మృతి చెందాడు. మిడుతూరు మండలం అలగనురు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే గర్భిణీ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ క్రమంలో శిశువును బయటకు తీసే క్రమంలో తల కడుపులో ఉండి పోయింది. మొండెం బయటకు తీశారు. తల బయటకు తీస్తే తల్లి ప్రాణానికి ముప్పుని వైద్యులు చెప్పటంతో... కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ శిశువు తలను బయటకు తీశారు. నంద్యాల వైద్యుల తీరు పై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కడుపులోని శిశువు మృతి చెందాడని.... తాము ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని వైద్యులు తెలిపారు.
నంద్యాల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి - Infant deaths due to negligence of doctors
కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ శిశువు మృతి చెందాడు. కాన్పు కోసం వచ్చిన గర్భిణీని పరీక్షించి శిశువు కడుపులోనే చనిపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో శిశువును బయటకు తీస్తుండగా తల కడుపులోనే ఉండిపోయి.. మొండెం బయటకు తీశారు. అనంతరం బాధితురాలి పరిస్థితి విషమించటంతో ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి