కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇంఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో విశేష సేవలు అందించిన అధికారులు, వ్యక్తులకు అవార్డులు అందించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు.
పతకావిష్కరణ చేసి శకటాలను తిలకించిన మంత్రి అనిల్
కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ త్రివర్ణ జెండాను ఎగురవేశారు.
independence day celebrations in kurnool dst