కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇవాళ కొత్తగా నమోదైన 43 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం 386 కేసులు ఉన్నాయి. అందులో కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే 231 ఉన్నాయి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మరో 73 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కొత్తగా నమోదైన 43 కేసుల్లో కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 32, నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 8, పాములపాడు గ్రామంలో 1, తెలంగాణ రాష్ట్రం సరిహద్దు అయిన అలంపూర్ లో ఒకటి నమోదైంది.
కర్నూలులో కోరలు చాస్తున్న కొవిడ్ - కర్నూలు వార్తలు
కర్నూలు నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ జిల్లాలో కొత్తగా నమోదైన 43 కేసుల్లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 32 కేసులున్నాయి.
కర్నూలులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు