Srisailam Dam Gates Open: ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.64 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. స్పిల్‌వే ద్వారా 2.77 లక్షల క్యూసెక్కులు నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 211.47 టీఎంసీలు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి... 62 వేల 408 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Srisailam Dam: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
SRISAILAM: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 10 గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది.
srisailam