దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా.. ఎమ్మిగనూరులో రాస్తారోకో - ఎమ్మిగనూరులో దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతు వార్తలు
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాస్తారోకో నిర్వహించారు.
దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా.. ఎమ్మిగనూరులో రాస్తారోకో
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ యార్డు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుకు ఉరిగా మారిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, పొంపన్నగౌడ్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.