కర్నూలులో కొండచెరియల్లో చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న లేగదూడను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గుత్తి రోడ్డులో లేగదూడతో కలిసి కొండపై మేతకు వెళ్లిన ఆవు...వర్షం వల్ల అక్కడే చిక్కుకుపోయింది. వాన నీటికి జారి 30 అడుగుల నుంచి కిందపడి ఆవు మరణించింది. తల్లి గోవు మృతితో తల్లడిల్లుతూ..కిందకు దిగి రాలేని లేగదూడను చూసిన...స్థానికులు కాపాడేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. జోరు వానను సైతం లెక్కచేయక.. కొండపైనున్న లేగదూడను రక్షించారు.
జోరువానను సైతం లెక్కచేయక.. కొండపైనున్న లేగదూడను రక్షించారు
కొండ చరియల్లో నుంచి బయటకు రాలేక.. తల్లి ఆవు దగ్గరకు వెళ్లలేక విలవిలలాడుతున్న లేగ దూడను రాత్రివేళలో కుండపోతగా కురిసిన వర్షాన్ని లెక్క చేయకుండా 3 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
జోరు వానను సైతం లెక్కచేయక.. కొండపైనున్న లేగదూడను రక్షించారు
TAGGED:
కర్నూలు లేటెస్ట్ వార్తలు