కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టంతో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జూడాలు ఆవేదవ వ్యక్తం చేశారు. కర్నూల్లో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు మెడికల్ కళాశాల నుంచి రాజ్ విహార్ కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్ఎంసీ బిల్లుతో పేద విద్యార్థులకు వైద్య వృత్తి లోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. లిమిటెడ్ లైసెన్స్ కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో ఆర్ఎంపీలకు ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించడం సరికాదన్నారు.
కర్నూలులో జూనియర్ డాక్టర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లు రద్దును కోరుతూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు