వైకాపా పాలనా వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి తూర్పారబట్టారు. కర్నూలు జిల్లా తెదేపా విస్తృతస్థాయి సమావేశాల్లో భాగంగా తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్ నియోజకవర్గ నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.గత ఎన్నికల ఫలితాలతో నిరాశ
చెందకుండా భవిష్యత్‌పై.. దృష్టిసారించాలన్నారు.
తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న వైకాపా సర్కార్...కోడికత్తి, వివేకానందరెడ్డి హత్య కేసులను ఎంత వరకూ పరిష్కరించారని నిలదీశారు.అన్నక్యాంటీన్లు, పెళ్లికానుక వంటి పథకాల రద్దు చేసి పేదల పొట్టకొట్టిన ప్రభుత్వం.. వైకాపా కార్యకర్తలకు మాత్రం ప్రజల సొమ్ము పంచుతోందని దుయ్యబట్టారు.