కర్నూలు జిల్లా పత్తికొండలో వాహనంలో అక్రమంగా తరలిస్తోన్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటిని కర్ణాటకలోని బళ్లారి నుంచి తెస్తున్నట్లు గుర్తించారు. స్థానిక వేర్హౌస్ వద్ద ఎస్సై మస్తాన్ వలీ వాహన తనిఖీ చేస్తుండగా మద్దికేరకు చెందిన శంకర్ అనే వ్యక్తి వద్ద సరకును గుర్తించారు. వీటి విలువ రూ.30 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుణ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
30 వేల రూపాయల విలువైన అక్రమ గుట్కా ప్యాకెట్లు పట్టివేత - gutka packets
30 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తుండగా కర్నూలు జిల్లాలోని పోలీసులు పట్టుకున్నారు. నిందితులతో సహా వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
30 వేల రూపాయల విలువైన అక్రమ గుట్కా ప్యాకెట్లు పట్టివేత