కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్టు వద్ద కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దేవనకొండ మండలంలోని ఐరన్బండ గ్రామానికి చెందిన రామన్న, రవి అనే ఇద్దరు వ్యక్తులు లక్షన్నర రూపాయలు విలువైన కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు... కారును అనుసరించి పట్టుకున్నారు. కారు, మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు - madhavaram crime news
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణా జోరందుకుంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో సరకును తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా మాధవరం, తిరుపతిలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మద్యం, నలుగురిని అరెస్టు చేశారు.
![అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు illegal wine seized in madhavaram, thirupathi in andhrapradhesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10896120-153-10896120-1615045141289.jpg)
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత... నలుగురు అరెస్టు
మరో ఘటనలో కారులో ప్రత్యేక అరను ఏర్పాటు చేసుకుని అక్రమ మద్యం తరలిస్తున్న నిందితులను తిరుపతి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నగరంలోని ఎస్వీ జూ పార్క్ సమీపంలో... అలిపిరి చెర్లోపల్లి రహదారిపై అక్రమ మద్యాన్ని తరలిస్తున్నారని సమాచారంతో.. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 128 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇదీచదవండి.