అక్రమంగా తరలిస్తున్న 32.3 కిలోల వెండిని కర్నూలు సరిహద్దుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. వెండి వెలుగు చూసింది. కర్నూలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో వెండిని తరలిస్తున్నారు. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు గుర్తించిన నిందితులు.. అలంపూర్ చౌరస్తా వద్ద ముందుగానే బస్సు దిగి బ్యాగులతో సహా నడవటం మొదలుపెట్టారు. అనుమానంతో విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు.. భారీగా వెండి ఆభరణాలు గుర్తించారు. వెండిని తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులు సహా.. వారికోసం వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 32.3 కిలోల వెండి పట్టివేత - illegal transport of silver at kurnool
కర్నూలు సరిహద్దుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనీఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 32.3 కిలోల వెండిని.. పంచలింగాల చెక్‌పోస్టు పట్టుకున్నారు. వెండివి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా.. వారికోసం వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 32.3 కిలోల వెండి పట్టివేత