తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను... కర్నూలు జిల్లా మహానంది పోలీసులు పట్టుకున్నారు. మహానంది మండలం గాజులపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో... ప్రకాశం జిల్లా వైపు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేయగా 436 మద్యం సీసాలు లభించాయి. ప్రకాశం జిల్లా అర్దవీడుకు చెందిన షేక్ ఇబ్రహీం, ఇస్మాయిల్ అనే ఇద్దరు అన్నదమ్ములు హైదరాబాద్లో నివాసముంటున్నారు. తెలంగాణ మద్యాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని గమనించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలింపు..ఇద్దరు అరెస్ట్ - అక్రమ మద్యం స్వాధీనం వార్తలు
తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 436మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
TAGGED:
అక్రమ మద్యం స్వాధీనం వార్తలు