కర్నూలు జిల్లా నందవరం మండలంలోని పూలచింత వద్ద పోలీసుల దాడుల్లో 350 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నందవరానికి చెందిన రాజు, చిగిలన్న అనే ఇద్దరు... ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎమ్మిగనూరు సీఐ మంజునాథ్ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం పట్టివేత.. 350 ప్యాకెట్లు స్వాధీనం - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా నందవరం మండలం పూలచింత వద్ద కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 350 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
350 ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టివేత